వినాయక నిమజ్జనంలో అపశృతి..
చెరువులో యువకుడు గల్లంతు
NEWS Sep 19,2024 02:46 pm
చేగుంట మండలం ఇబ్రహీంపూర్ లో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. వినాయక నిమజ్జనం అనంతరం స్నానం చేసేందుకు చెరువులోకి వెళ్లిన మైసన్నగారి నవీన్ నీట మునిగి గల్లంతయ్యాడు. సుగుణ, బిక్షపతి దంపతుల ఏకైక కుమారుడైన నవీన్ డిగ్రీ పూర్తి చేశాడు. చెరువులో గల్లంతు కాగా.. గాలింపు చర్యలు చేపట్టారు. ఇబ్రహీంపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.