ఎమ్మెల్యే బత్తులకు సత్కారం
NEWS Sep 20,2024 08:06 am
ది.రాజమండ్రి మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందన సత్కార సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేశ్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి చేతుల మీదుగా బత్తుల బలరామకృష్ణను సాలువతో సత్కరించారు. విజయవాడ వరదల్లో చూపిన చోరవ మరువలేనదని ఆయణ్ను కొనియాడారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.