స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం కృషి
NEWS Sep 20,2024 08:05 am
స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు సూచించారు. ఆయన రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద అధికారులు సిబ్బంది చేత స్వచ్ఛతహి సేవ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత కోసం కొంత సమయాన్ని కేటాయిస్తామని ఈ సమావేశంలో ప్రతిజ్ఞ చేయించినట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు.