అక్టోబర్ 2 నుంచి దసరా సెలవులు
NEWS Sep 19,2024 11:55 am
తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలోని పాఠశాలలకు అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 14 వరకు దసరా సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 2 గాంధీ జయంతి కలుపుకొని మొత్తం13 రోజులు అన్ని విద్యాసంస్థలకు సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 15వ తేదీన పాఠశాలలు పున: ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు.