మంచిర్యాల జిల్లా నెన్నెల పోలీస్ స్టేషన్లోకి భారీ కొండచిలువ వచ్చింది. పోలీస్ స్టేషన్ ప్రహరీ ముళ్లకంచెలో చిక్కుకోవడం వల్ల కొండచిలువకు రక్తస్రావం అయ్యింది. అటవీ అధికారులు స్నేక్ క్యాచర్ సహాయంతో చికిత్స నిమిత్తం బెల్లంపల్లి వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. కొండచిలువకు 2 చోట్ల తెగిన శరీరానికి కుట్లు వేసి రక్షించారు డాక్టర్లు. తర్వాత దాన్ని ఎల్లారం ఫారెస్ట్‌లో వదిలిపెట్టారు.