మల్లాపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని
సందర్శించిన డీఎంహెచ్వో
NEWS Sep 19,2024 11:52 am
మల్లాపూర్ మండలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో సమియొద్దీన్ సూచించారు. ఆయన మల్లాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఇండ్ల పరిసరాల్లో నిల్వ నీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని, దోమల నివారణకు డ్రైనేజీల్లో శానిటైజేషన్ చేయాలన్నారు. మెడికల్ ఆఫీసర్ వాహిని, సీహెచ్వో రామ్మోహన్, హెచ్ఐవో వేణురావు, పీహెచ్ఎన్ ఇందిర, హెల్త్ సూపర్వైజర్ ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు.