ఎంపీపీ పాఠశాలలో కుళ్ళిన కోడిగుడ్లు
NEWS Sep 19,2024 11:56 am
అనంతగిరి మండలం కొత్తూరు పంచాయతీ పరిధి శివలింగపురంలో ఉన్న ఎంపీపీ పాఠశాలలో కుళ్ళిన కోడిగుడ్లను పంపిణీ చేశారని విద్యా కమిటీ ఛైర్మన్ శ్రీకాంత్ ఆరోపిస్తున్నారు. సెప్టెంబర్ నెలలో ఈ కోడిగుడ్లను పంపిణీ చేశారన్నారు. మధ్యాహ్న భోజనంలో భాగంగా విద్యార్థులకు పౌష్టికాహారం కార్యక్రమంలో ఈ గుడ్లు అందిస్తుందన్నారు. అధికారుల నిఘా లేకపోవడంతోనే కుళ్ళిన కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారని అధికారులు స్పందించాలని కోరారు.