చౌలమద్దిలో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన
NEWS Sep 19,2024 11:52 am
మెట్పల్లి మండలం చౌలమద్ది గ్రామంలో మహిళా సంఘాల మహిళలకు స్వచ్ఛత హిసేవ పక్షోత్సవాలలో భాగంగా గురువారం శుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. చేతులు కడుక్కునే విధానంపై వివరించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ వివోఏ పవిత్ర వాణి, అంగన్వాడీ టీచర్లు కవిత, దీపా, ఆశ కార్యకర్త లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.