జగిత్యాల మెడికల్ కళాశాలను తనిఖీ చేసిన కలెక్టర్
NEWS Sep 19,2024 11:52 am
జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలను కలెక్టర్ సత్య ప్రసాద్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాఫ్ డీటెయిల్స్, డిజిటల్ లాబ్ అనాటమీ, మ్యూజియం రీసెర్చ్ రూమ్, లైబ్రరీ, కళాశాలలో తరగతి గదులు తదితర వాటిని పరిశీలించారు. కళాశాలలో విద్యార్థులు ఎంతమంది ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల భవనాన్ని పరిశీలించారు. ఆయన వెంట ప్రిన్సిపల్ ఖాద్రి తదితరులున్నారు.