చేతుల పరిశుభ్రతపై అవగాహన
NEWS Sep 19,2024 11:52 am
మెట్పల్లి మండలం ఆత్మనగర్ గ్రామంలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా చేతుల పరిశుభ్రతపై పాఠశాల విద్యార్థులకు గురువారం అవగాహన కల్పించారు. గ్రామ పంచాయతీ, పాఠశాల ఆవరణను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నిజాముద్దీన్, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.