21 వరకు ఓటరు జాబితాలో
సవరణలకు అవకాశం
NEWS Sep 19,2024 08:44 am
నెన్నెల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం అన్ని రాజకీయ పార్టీల సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ దేవేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్షించారు. ఓటరు జాబితాలో సవరణలకు ఈ నెల 21 వరకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రం మార్పు, ఓటరు జాబితాలో పేర్లు సవరణ చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.