బీసీల డిమాండ్లను పరిష్కరించాలి
NEWS Sep 19,2024 08:45 am
బీసీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గురువారం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా బీసీ కార్పొరేషన్ ఏడీ వినోద్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీ ఫెడరేషన్లకు పాలక మండళ్లు నియమించి నిధులు విడుదల చేయాలని, నాలుగేళ్ళ క్రితం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.