రైతు నాయకుల ముందస్తు అరెస్ట్
NEWS Sep 19,2024 08:43 am
మల్లాపూర్ మండల కేంద్రంలో గురువారం రైతు నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. రైతు రుణమాఫీ కొరకు చలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమంనకు వెళ్లకుండా నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారని, రైతుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియను ఎప్పుడు పూర్తి చేస్తుందో స్పష్టమైన ప్రకటన ఇవ్వాలన్నారు.