వందే భారత్ రైలుకు మంచిర్యాల
రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ ఇవ్వాలి
NEWS Sep 19,2024 08:45 am
సికింద్రాబాద్- నాగ్ పూర్ మధ్య ప్రారంభమైన వందే భారత్ రైలుకు మంచిర్యాల రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ ఇవ్వాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గురువారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కు వినతిపత్రం అందజేశారు. చాలామంది ప్రజలు నిత్యం నాగ్ పూర్, హైదరాబాద్ కు రాకపోకలు సాగిస్తారని తెలిపారు రైల్వే కు అత్యధిక ఆదాయం అందిస్తున్న మంచిర్యాల లో వందే భారత్ రైలును నిలపాలని కోరారు.