మోడీ, షా దిష్టిబొమ్మల దగ్దం
NEWS Sep 19,2024 08:44 am
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నేత తన్విందర్ సింగ్ కామెంట్లపై గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక బెల్లంపల్లి చౌరస్తాలో బీజేపీ నేతల దిష్టిబొమ్మను దగ్దం చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని డిమాండ్ చేశారు.