గోవాలో కొరియోగ్రాఫర్ జానీ అరెస్ట్
NEWS Sep 19,2024 07:05 am
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ను లైంగికంగా వేధింపులకు గురి చేసిన కేసులో కొరియోగ్రాఫర్ జానీని అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. 5 రోజులుగా 4 ప్రత్యేక బృందాలు గాలింపు చేయగా గోవాలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో SOT టీం.. గోవా వెళ్లింది. జానీపై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. పోక్సో చట్టం కింద కూడా కేసు ఫైనల్ అయ్యింది. మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మైనర్‌గా ఉన్నప్పటి నుంచే లైంగిక వేధింపులకు గురి చేసినట్లు.. బాధితురాలు కంప్లైంట్ చేసింది.