ప్రమాణం చేయడానికి మేం సిద్ధం
NEWS Sep 19,2024 07:01 am
టీటీడీ లడ్డూ ప్రసాదంలో గత ప్రభుత్వం జంతువుల కొవ్వు కలిపేదన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తోసిపుచ్చారు. తిరుమల పవిత్రతను, కోట్లాదిమంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు తీవ్రంగా దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాను తన కుటుంబంతో కలిసి భగవంతుడి సన్నిధిలో ప్రమాణం చేయడానికి సిద్ధమని, చంద్రబాబు కూడా అలా చేయడానికి సిద్ధమా? అని సవాలు విసిరారు.