పారిశుధ్యం లోపించి ప్రజల ఇబ్బందులు
NEWS Sep 19,2024 06:56 am
బెల్లంపల్లి పట్టణంలోని బూడిది గడ్డ బస్తీలో పారిశుధ్యం లోపించి ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. 21, 22వ వార్డుల పరిధిలోని మురుగునీరు వెళ్లే డ్రైనేజీ పూడికతో నిండుకుంది. దీంతో మురుగునీరు రోడ్డుపై నిలిచి రాకపోకలు సాగించే వారు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే మున్సిపల్ చైర్ పర్సన్, అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సయ్యద్ అహ్మద్ డిమాండ్ చేశారు.