డీజే సౌండ్: గుండెపోటుతో వ్యక్తి మృతి
NEWS Sep 19,2024 05:50 am
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగులో వినాయక నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనంలో భాగంగా గ్రామంలో వినాయకులను తీసుకెళ్లేందుకు డిజె సౌండ్‌తో యువకులు ఊరేగింపుగా వెళ్లారు. గ్రామానికి చెందిన మ్యాకల ఆశాలు అనే వ్యక్తి వికాలంగుడు ఉదయం వినాయక నిమజ్జనం చూసేందుకు ఇంటిపక్కనే కూర్చున్నాడు. యువకులు వినాయకులను తీసుకెళ్లగా చూసి అక్కడే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గుండెపోటు అని గమణించిన స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం అందించి అసుపత్రికి తరలించే లోపు మృతి చెందాడు.