లబ్ధిదారులకు వంట గ్యాస్
సబ్సిడీ పత్రాలు పంపిణీ
NEWS Sep 19,2024 05:53 am
భీమారం మండలం కాజిపల్లి గ్రామంలో మహాలక్ష్మి పథకం కింద లబ్ధిదారులకు వంట గ్యాస్ సబ్సిడీ పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రూ.500కు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పత్రాలను అర్హులైన వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, మాజీ సర్పంచ్ దాడి తిరుపతి, తెలంగాణ గొర్రెలు మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ పాల్గొన్నారు.