5 అంతస్తుల బిల్డింగ్ నేలమట్టం
NEWS Sep 19,2024 05:28 am
మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలో పరిధిలో 5 అంతస్తుల బిల్డింగ్‌ను నేలమట్టం చేశారు అధికారులు. ఓ సర్వే నెంబర్‌పై అనుమతి తీసుకుని మరో సర్వే నెంబర్‌లో నిర్మించాడు. నోటీసులు ఇచ్చినా కూడా 5 అంతస్తుల బిల్డింగ్ కట్టేశాడు ఆ కార్మిక సంఘం నాయకుడు. ఈ క్రమంలోనే ఈ 5 అంతస్తుల భవనాన్ని నస్పూర్ మున్సిపల్ అధికారులు ఈ రోజు కూల్చివేశారు. భారీ బుల్డోజర్లతో బిల్డింగ్‌ను పడగొట్టారు.