తానా ఆధ్వర్యంలో వరద బాధితులకు
నిత్యావసరాలు పంపిణీ
NEWS Sep 19,2024 05:51 am
తానా ఆధ్వర్యంలో వదర బాధితులకు స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో 480 వరద బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు అందజేశారు.తానా ప్రతినిధి వల్లేపల్లి శశికాంత్ సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు, బీజేపీ మైలవరం నియోజకవర్గ ఇంచార్జి నూతులపాటి బాలకోటేశ్వరరావు(బాల),కూటమి నాయకులు పాల్గొన్నారు.