టీబీజీకేఎస్ నాయకుడి భవనం కూల్చివేత
NEWS Sep 19,2024 05:52 am
నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 42లో టీబీజీకేఎస్ నాయకుడు డీకొండ అన్నయ్య నిర్మించుకున్న 5 అంతస్తుల భవనాన్ని రెవిన్యూ, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కూల్చివేస్తున్నారు. ఇవాళ ఉదయం జేసిబి, సిబ్బందితో అక్కడికి చేరుకున్న అధికారులు భవనం కూల్చివేత పర్వం మొదలుపెట్టారు. భవనం కూల్చివేత నేపథ్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.