పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
NEWS Sep 19,2024 05:52 am
సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధి ఇందిరానగర్ ఏరియాలోని పాత కోళ్ళ ఫారంలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై బుధవారం రాత్రి రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. తమకు అందిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రాజ్ కుమార్ సిబ్బందితో కలిసి పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ.30,970 నగదు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.