BRS నాయకుల ముందస్తు అరెస్ట్
NEWS Sep 19,2024 05:51 am
రుణమాఫీ మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం తలపెట్టిన చలో ప్రజా భవన్ ముట్టడి నేపథ్యంలో కోటపల్లి మండలంలోని పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ వెళ్లకుండా వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.