రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్
NEWS Sep 19,2024 03:50 am
అరకులోయ మండలంలోని బస్కి పంచాయితీ గోండన, పిరిపొదొర్ గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని గిరిజనులు వేడుకుంటున్నారు. వారు మాట్లాడుతూ.. గోండన, పిరిపొదొర్ గ్రామాల నుంచి మండల కేంద్రానికి రావాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. అత్యవసర సమయాల్లో రాకపోకలకు అవస్థలకు గురవుతున్నామని చెప్పారు. అధికారులు స్పందించి తమ గ్రామాలకు బీటీ రహదారి నిర్మించాలని కోరుతున్నారు.