డుంబ్రిగుడ గ్రామ పెద్ద మృతి
NEWS Sep 19,2024 03:49 am
డుంబ్రిగుడలో విషాదం చోటు చేసుకుంది. గ్రామ పెద్ద ( బారికి ) కమ్మిడి వైకుంఠరావు కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన పోతంగి పంచాయితీలో ఉన్న ప్రతి గ్రామానికి ఎన్నో సేవలను అందించారు. ఆయా గ్రామాలలో ఏ చిన్న విషయం జరిగిన కచ్చితంగా ఆయన హాజరవ్వాల్సిందే. ఆయన మరణం జీర్ణించకోలేక పోతున్నామని పోతంగి పంచాయితీలో ఉన్న గ్రామ గిరిజనులు తెలిపారు.