కేటీఆర్ కు దామోదర హెచ్చరిక
NEWS Sep 19,2024 03:54 am
ప్రభుత్వ ఆసుపత్రులను నాశనం చేసే కుట్రలను కేటీఆర్ మానుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. బీఆర్ఎస్ కుట్రలను నమ్మి భయపడవద్దని, ధైర్యంగా గాంధీ ఆసుపత్రికి వచ్చి వైద్యం చేయించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గాంధీ ఆసుపత్రిని నాశనం చేసి పేద రోగులు రాకుండా చేసి కార్పొరేట్ ఆసుపత్రులకు లబ్ది చేకూర్చాలని కేటీఆర్ కుట్ర పన్నుతున్నారని మంత్రి ఆరోపించారు.