తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో డ్రోన్ గణేష్ విగ్రహ నిమజ్జనం వైరల్ గా మారింది. కడియపులంక మహాలక్ష్మి చింత దగ్గర వివేక్ ఈ చిట్టి బాల గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసాడు. అయితే పిల్లలు నెలకొల్పిన ఈ గణపతి విగ్రహాన్ని కోటిపల్లి కాలువలో నేరుగా నిమజ్జనం చేయడం ప్రమాదకరంగా భావించిన కుటుంబ పెద్దలు నర్సరీలలో పురుగు మందులు పిచికారికి వినియోగించే డ్రోన్ సహాయంతో నిమజ్జనం చేశారు.