మాజీ సర్పంచ్ ను పరామర్శించిన MLA
NEWS Sep 19,2024 03:53 am
మల్యాల మండలం తక్కళ్ళపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మరాటి లక్ష్మీనారాయణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం పరామర్శించారు. ఆరోగ్యం మెరుగుపడే వరకు డాక్టర్ల సూచన మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే అదే గ్రామానికి చెందిన కనక భాగ్యలక్ష్మి ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట ఆనందరెడ్డి, ఆదిరెడ్డి, శంకర్, సతీష్, లక్ష్మణ్, వంశీధర్, హరినాథ్, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు