2వ ధనిక రాష్ట్రంగా తెలంగాణ!
NEWS Sep 18,2024 06:26 pm
ఢిల్లీ: దేశంలోనే తెలంగాణ రెండో ధనిక రాష్ట్రంగా నిలిచింది. తొలి స్థానంలో ఢిల్లీ నిలిచింది. కర్ణాటక 3, హర్యాణ 4, తమిళనాడు 5 వ స్థానాల్లో నిలిచాయి. ఏపీ జీడీపీలో 9, తలసరి ఆదాయం గణాంకాల ప్రకారం 16వ స్థానంలో నిలిచింది. మరోపక్క దేశంలోనే అత్యంత పేద రాష్ట్రాల్లో బీహార్ తొలి స్థానంలో, ఝార్ఖండ్ 2వ స్థానంలో ఉంది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఈ జాబితాను రాష్ట్రాల తలసరి ఆదాయాన్ని ప్రమాణికంగా చేసుకొని రూపొందిస్తుంది.