నిమజ్జనం పరిశీలించిన
మున్సిపల్ చైర్ పర్సన్ జిందం
NEWS Sep 18,2024 05:57 pm
సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల మానేరు నది తీరంలో 2వ రోజు నిర్వహిస్తున్న వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ తో సంబంధిత అధికారులతో మాట్లాడుతూ భక్తుల మనోభావాలను గౌరవిస్తూ వినాయకులను నీళ్లలో మునిగేలా నిమజ్జనం చేయాలని అందుకు తగిన చర్యలు చేపట్టవలసిందిగా ఆదేశిస్తూ, పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.