బతుకమ్మకు స్థలం కేటాయించాలి
NEWS Sep 18,2024 09:57 am
బెల్లంపల్లి మున్సిపాలిటీ 13వ వార్డు పరిధిలోని కాల్ టెక్స్ ఏరియాలో మహిళలు బతుకమ్మ పండుగను జరుపుకోవడానికి స్థలం కేటాయించాలని వార్డు కౌన్సిలర్ బండి ప్రభాకర్ యాదవ్, 12 వార్డు కౌన్సిలర్ నెల్లి శ్రీలత రమేష్ కోరారు. ఈ మేరకు బుధవారం వారు ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామికి వినతి పత్రం అందజేశారు. వెంటనే స్థలం కేటాయించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.