మల్లాపూర్ తహసిల్దార్ కార్యాలయంను
ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
NEWS Sep 18,2024 09:32 am
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ సత్య ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆఫీస్ రికార్డులను పరిశీలించారు. అనంతరం ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, వివిధ సర్టిఫికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట తహసిల్దార్ వీర్ సింగ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.