కరీంనగర్ జిల్లా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్ ఆధ్వర్యంలో టీఎన్జిఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ విమోచన దినోత్సవం ఛాయా చిత్ర ప్రదర్శనలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. నాటి వాస్తవాల విషయాలను తెలిపేందుకే కేంద్ర ప్రభుత్వ చొరవతో హైదరాబాద్ విమోచన దినోత్సవ ఛాయా ప్రదర్శన ఏర్పాటైందని తెలిపారు. తెలంగాణ అంటేనే ఇప్పటికీ ప్రజల్లో రకరకాల ఊహాగానాలున్నాయన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు.