అందోల్ గణపయ్య లడ్డు 90,000
NEWS Sep 18,2024 07:02 am
సంగారెడ్డి జిల్లా ఆందోల్ గ్రామంలో శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయంలో కొలువుదిరిన 18 అడుగుల గణపయ్య లడ్డు వేలం పాట జరిగింది. ఈ వేలం పాటలో 20 కిలోల లడ్డును 90 వేల రూపాయలకు దక్కించుకున్నారు బేగరి ప్రసాద్. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ.. గణేషుడి ప్రసాదం దక్కడం చాలా ఆనందంగా ఉందన్నారు. మా గ్రామ ప్రజలందరూ కూడా సుఖసంతోషాలతో ఉండాలని, స్వామివారి కృప ఉండాలని, ఆలయ కమిటీ వారికి ధన్యవాదాలు తెలిపారు.