గ్రామాల పరిశుభ్రంతోనే ఆరోగ్య సమాజం
NEWS Sep 18,2024 06:43 am
జైపూర్ గ్రామ పంచాయతీలోని రైతు వేదిక వద్ద బుధవారం స్వచ్ఛత హి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్ ముఖ్య అతిథిగా హాజరై రైతు వేదిక పరిసరాలలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్య సమాజం నిర్మితమవుతుందని అన్నారు. ఎంపీడీఓ సత్యనారాయణ, ఎంపీవో శ్రీపతి బాపు రావు, తదితరులు పాల్గొన్నారు.