గణేష్ నిమజ్జన వేడుకలను సరళిని
పరిశీలించిన కలెక్టర్ బి.సత్యప్రసాద్
NEWS Sep 18,2024 06:40 am
గణేష్ నిమజ్జనం వేడుకలను పురస్కరించుకుని నేటి ఉదయం జగిత్యాల పట్టణంలో జరుగుతున్న నిమజ్జన వేడుకలను ఆర్డీవో, మధుసుధన్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జగిత్యాల చింతకుంట చెరువును పరిశీలించారు. జగిత్యాలలో నిమజ్జన విగ్రహాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మిగతా విగ్రహాల నిమజ్జనాలు ముగించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు, శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.