గని ప్రమాదంగా పరిగణించాలి
NEWS Sep 18,2024 06:42 am
మందమర్రి ఏరియాలోని కేకే- 5 గనిలో కోల్ కట్టర్ కార్మికుడు మిట్టపల్లి లక్ష్మణ్ మృతిని గని ప్రమాదంగా పరిగణించాలని ఐఎన్టీయుసి సెక్రెటరీ జనరల్, తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ అన్నారు. కార్మికుడి కుటుంబానికి రావలసిన అన్ని ప్రయోజనాలను వెంటనే ఇవ్వాలని అధికారులతో మాట్లాడారు. కార్మికుడు కుటుంబంలో ఒకరికి అర్హత తగిన ఉద్యోగం ఇవ్వాలని, ఈ ఘటనపై పూర్తి విచారణ చేయాలని డిమాండ్ చేశారు.