రూ.7వేలు ఇచ్చి చంపేయమన్నాడు
NEWS Sep 18,2024 07:41 am
రాజానగరం: ఈ నెల 12న జరిగిన హత్యాయత్నం కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని సీఐ వీరయ్య గౌడ్ మంగళవారం తెలిపారు. రంగంపేటకు చెందిన శ్రీనివాస్‌ను హత్య చేయాలని సుభద్రంపేటకు చెందిన సుబ్రహ్మణ్యం తన స్నేహితునికి చెప్పగా అతను మరో వ్యక్తికి రూ.7 వేలు ఇచ్చి హత్య చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో సుత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని తెలిపారు. శ్రీనివాస్ ఫిర్యాదు నిందితులను అరెస్టు చేశామన్నారు.