రేలంగి కాంస్య విగ్రహం ఆవిష్కరణ
NEWS Sep 18,2024 07:40 am
రాజమండ్రి: ఈ నెల 19న ప్రముఖ హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య కాంస్య విగ్రహాన్ని రాజమండ్రిలోని గోదావరి గట్టున ఆవిష్కరించనున్నట్లు శెట్టిబలిజ సంఘం గౌరవ అధ్యక్షుడు బుడ్గిగ శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేలంగి తనదైన హాస్యంతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. గోదావరితో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు.