అబ్బురపరిచే గణేషుడి చిత్రాలు
NEWS Sep 07,2024 06:41 am
వినాయక చవితి సందర్భంగా నంద్యాల జిల్లాకు చెందిన చిత్రకారుడు కోటేష్ అగ్గి పెట్టెపై 60 వినా యక సూక్ష్మ చిత్రాలను అద్భుతంగా చిత్రీకరించా డు. 2 గంటల టైంలోనే ఎంతో భక్తి శ్రద్ధలతో 2 అంగుళాల పొడవు, 22 అంగుళాల వెడల్పు 60 సూక్ష్మ వినాయక చిత్రాలు వాటర్ కలర్స్‌తో చిత్రీక రించి తన ప్రతిభను చాటుకున్నాడు. గణేశుడు భక్తులకు అభయమిస్తున్నట్లు, త్రిముఖ గణపతి, నాట్యగణపతి, శంఖులో గణపతి, ఓం ఆకారంలో గణేశుడు, కాణిపాకం గణపతి, ఇలా అనేక భంగిమల్లో చిత్రీకరించారు.