రాళ్లదొడ్డిలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం..
స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసిన ప్రజాప్రతినిధి
NEWS Sep 20,2026 11:49 am
రాళ్లదొడ్డిలో స్వచ్ఛాంధ్ర–స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశాను. అనంతరం పాఠశాలను పరిశీలించి మౌలిక వసతులు, తాగునీరు, పాఠశాల భవనం పునర్నిర్మాణంపై అధికారులతో చర్చించాను. గ్రామ ప్రజలను కలిసి సంక్షేమ పథకాలు, సాగునీటి అవసరాలపై అభిప్రాయాలు తెలుసుకున్నాను. స్వచ్ఛమైన గ్రామం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలి.