ఐ డ్రాప్స్‌తో కళ్లద్దాలకు చెక్!
NEWS Sep 07,2024 05:27 am
కంటి చూపు సమస్య ఉన్న వారు కళ్లలో ఈ డ్రాప్ వేసుకున్నట్లయితే 6 గంటల పాటు కంటి అద్దాలను ధరించకుండా ఉండగలుగుతారు. ఈ డ్రాప్ పేరు Presvu Eye Drop. ఈ డ్రాప్స్ కారణంగా దగ్గరగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలుగుతారని వైద్యుడు తుషార్ చెప్పారు. అద్దాలకు ప్రత్యామ్నాయంగా చూస్తున్న వారు, అద్దాలు ధరించకుండా ఉండాలంటే ప్రతి 6 గంటలకు ఒకసారి కళ్లలో ఈ చుక్కలు వేయాల్సి ఉంటుంది. అద్దాలను లేకుండా శాశ్వతంగా కాకుండా, తాత్కలికంగా పని చేస్తుందట. అక్టోబర్‌లో అందుబాటులోకి వస్తుంది.