వరద బాధితులను ఆదుకునేందుకు మెగా డాటర్ కొణిదెల నిహారిక కూడా తన వంతు సాయం ప్రకటించారు. ముంపునకు గురైన 10 గ్రామాలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. విజయవాడ వరద బాధితుల కోసం రూ. 5 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. 10 గ్రామాలకు రూ.50 వేలు చొప్పున ఐదు లక్షలు విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు నిహారిక తెలిపారు.