మేడారం మహా జాతరలో అసలైన ఘట్టం ఆవిష్కృతమైంది. డప్పుల దరువులు, శివసత్తుల పూనకాల నడుమ కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెపై కొలువుదీరింది. అటు కొండాయి నుంచి గోవిందరాజు, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజులను గద్దెలపై ప్రతిష్ఠించడంతో జాతర అంకురార్పణ జరిగింది. జంపన్నవాగు భక్తులతో కిటకిటలాడుతోంది. నిలువెత్తు బంగారం, చీరలతో భక్తులు మొక్కులు చెల్లిస్తున్నారు.