సంకల్‌చంద్ పటేల్ యూనివర్శిటీ ప్రారంభం
NEWS Jan 28,2026 11:10 pm
ఉత్తరాంధ్ర విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో గుజరాత్‌కు చెందిన సుప్రసిద్ధ సంకల్‌చంద్ పటేల్ యూనివర్శిటీ విశాఖపట్నం ద్వారకానగర్‌లో తన నూతన సమాచార కేంద్రాన్ని ప్రారంభించింది. యూనివర్శిటీ ప్రెసిడెంట్ ప్రకాష్‌భాయ్ పటేల్, తెలుగు రాష్ట్రాల మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి పాల్గొని వివరాలు తెలిపారు. కాలానుగుణంగా డిమాండ్ ఉన్న AI & ML, డేటా సైన్స్, ఐటీ బీటెక్ కోర్సులతో పాటు ఫోరెన్సిక్ సైన్సెస్, క్రిమినాలజీ, డిజిటల్ ఫోరెన్సిక్, అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సులను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కేంద్రం ద్వారా విద్యార్థులకు సరైన మార్గనిర్దేశం లభిస్తుందని అన్నారు.