బైరు మల్లయ్య స్ఫూర్తితో సాగుదాం
NEWS Sep 06,2024 05:29 pm
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు బైరు మల్లయ్య వర్ధంతి కార్యక్రమం TPSK అధ్య క్షులు భూపతి వెంకటేశ్వర్లు అధ్యక్షతన సుందర య్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ మాట్లాడుతూ బైరు మల్లయ్య కల్లుగీత కార్మికుల హక్కుల కోసం పోరాడిన గొప్ప యోధుడని కొని యాడారు. గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ నాయక్, రజక సంఘం అధ్యక్షులు నరేష్, పెద్ది రాణా ప్రతాప్, రజిత, ఇందిరా, రాజయ్య, వెంకన్న పాల్గొన్నారు.