డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఆందోళన
NEWS Sep 06,2024 06:00 pm
జగిత్యాల జిల్లా నూకపెల్లి వద్ద గత సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 4520 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను గతేడాది అక్టోబర్ లో పేదలకు పంపిణీ చేశారు. అయితే ఎన్నికల కోడ్ కారణంగా మౌళిక వసతులు కల్పించకపోగా కాంగ్రెస్ సర్కారు ఏర్పడి 9 నెలలు గడుస్తున్నా విద్యుత్ సౌకర్యం, నీటి వసతి లేదని లబ్ధిదారులు రోడ్డెక్కారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలపగా రంగప్రవేశం చేసిన పోలీసులు సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని తెలపడంతో ధర్నా విరమించారు.