పీసీసీ కొత్త అధ్యక్షుడు మహేశ్ గౌడ్‌కు
సేపూర్ స్వామిగౌడ్ శుభాకాంక్షలు
NEWS Sep 06,2024 05:07 pm
NZB: తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ నియామకం అయిన సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నాయకులు సేపూర్ స్వామిగౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థి దశలోనే NSUIలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేసిన మహేశ్ గౌడ్ సుదీర్ఘ కాలం పార్టీకి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. మహేశ్ గౌడ్‌ను పీసీసీ అధ్యక్షునిగా నియమించిన పార్టీ అధిష్టానానికి స్వామిగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పార్టీ మరింతా బలోపేతం కావడం ఖాయమన్నారు.